రీల్స్, కరోనా కన్నా డేంజర్!.. బైక్‌పై రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

కదులుతున్న బైక్ పై రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

Update: 2024-07-06 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కదులుతున్న బైక్ పై రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్య జనాలు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. కొందరు బిల్డింగ్స్ చివరికి ఎక్కి స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు బైక్స్ పై స్టంట్స్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు. మహారాష్ట్రలోని ధూలే- సోలాపూర్ హైవేలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఇంతలో వెనుక కూర్చున్న వ్యక్తి ఫోన్ తీసి ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ లో నటించేందుకు ప్రయత్నించాడు.

బైక్ డ్రైవ్ చేస్తున్న రైడర్ ఇది చూసి అతను కూడా ఫోన్ వైపే చూసి బండి నడిపాడు. దీంతో బైక్ తో సహా ఇద్దరు వెళ్లి హైవే పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. హెల్మెట్ లేకుండా బైక్ నడపడమే తప్పు, పైగా రీల్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఎవరిని నిందించడానికి లేదని, వారి కర్మకు వారే బాధ్యులు అని, రీల్స్ వల్ల సమాజమే భ్రష్టు పట్టిందని, రీల్స్ కరోనా కన్నా డేంజర్ అని ఇలా పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.   https://x.com/priyarajputlive/status/1809505248114807012


Similar News

టమాటా @ 100