ఏటా రూ.లక్ష కోట్ల రుణాలివ్వాలి.. ఎన్సీడీసీకి అమిత్ షా పిలుపు

Update: 2023-10-09 17:08 GMT

న్యూఢిల్లీ : వచ్చే మూడేళ్లలో ప్రతి సంవత్సరం రూ.లక్ష కోట్ల రుణాలను మంజూరు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)కు కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా సూచించారు. తక్కువ రేట్లకు రుణాలు తీసుకునే మార్గాలను తొలుత ఎన్సీడీసీ అన్వేషించాలని.. ఆ విధంగా సేకరించే నిధులను సాధ్యమైనంత తక్కువ వడ్డీరేట్లకు సహకార రంగానికి లోన్లుగా ఇవ్వాలన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్సీడీసీ 89వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు.

ప్రధాని మోడీ సారథ్యంలో సహకార సంఘాలను పెద్ద పెద్ద బ్రాండ్‌‌లుగా మలిచే సంకల్పంతో ఎన్సీడీసీ పని చేస్తోందన్నారు. ఎగుమతులు, సేంద్రీయ ఉత్పత్తులు, విత్తనోత్పత్తి విభాగాలపై ప్రత్యేక ఫోకస్‌తో జాతీయ స్థాయిలో ఎన్సీడీసీ పని చేయాల్సి ఉందన్నారు. ఎన్సీడీసీ వార్షిక రుణ మంజూరు 2013-14లో రూ. 5,300 కోట్లు ఉండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి అది పదిరెట్లు పెరిగి రూ.41,000 కోట్లకు చేరిందన్నారు. మోడీ సర్కారు చొరవ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.


Similar News