సహారా పెట్టుబడిదారులకు అమిత్ షా గుడ్ న్యూస్..

సహారా గ్రూప్ కు చెందిన నాలుగు కోఆపరేటివ్ (హౌసింగ్) సొసైటీలోని ఇన్వెస్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది..

Update: 2023-03-31 06:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సహారా గ్రూప్ కు చెందిన నాలుగు కోఆపరేటివ్ (హౌసింగ్) సొసైటీలోని ఇన్వెస్టర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గ్రూప్ కు చెందిన నాలుగు సహకార సంఘాల్లో డబ్బు చిక్కుకుపోయిన 10 కోట్ల మంది పెట్టుబడిదారులు తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా వెల్లడించారు. ఈ ప్రక్రియ మరో మూడు నాలుగు నెలల్లో ప్రారంభం అవుతుందని చెప్పారు.

ఉత్తరాఖండ్ లో గురువారం అమిత్ షా ఈ ప్రకటన చేశారు. సహారా గ్రూప్ కోఆపరేటివ్ సొసైటీలలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల డబ్బులు తిరిగి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే పెట్టుబడిదారులకు వారి సొమ్ము చేరుతుందన్నారు. ఇందుకోసం సహకార సంఘాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేసిన వారు తమ క్లెయిమ్ లను కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కు పంపాలని తెలిపారు. కాగా సహారా గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో అధిక మంది చిన్న మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు.

Tags:    

Similar News