Amit shah: ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ నాయకత్వంలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని కొనియాడారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని కొనియాడారు. బీజేపీ సభ్యత్వాన్ని చేపట్టేందుకు ‘బీజేపీ సంఘటన్ పర్వ, సదస్యత అభియాన్ 2024’ని ప్రధాని మోడీ, పార్టీ చీఫ్ నడ్డాలు ప్రారంభించనున్న నేపథ్యంలో అమిత్ షా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. గత పదేళ్లలో దేశం నూతన శిఖరాలకు చేరుకుందని తెలిపారు. 140 కోట్ల మంది ప్రజలకు మోడీ వికసిత్ భారత్ దార్శనికతను అందించారని, దీనిని నెరవేర్చేందుకు బీజేపీని బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్న అన్ని రాజకీయ పార్టీలలో బీజేపీ ఎంతో ప్రత్యేకమైందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ బీజేపీతో జత కట్టాలని సూచించారు. బీజేపీ కేవలం కాగితాలకే పరిమితం కాదని ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో పని చేస్తోందని వెల్లడించారు.