Amerika night club: అమెరికా నైట్ క్లబ్‌లో కాల్పులు..ముగ్గురు యువకులు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిస్సిస్సిపీ రాష్ట్రంలోని ఇండియానా నైట్ క్లబ్‌లో దుండగులు ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

Update: 2024-07-22 16:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిస్సిస్సిపీ రాష్ట్రంలోని ఇండియానా నైట్ క్లబ్‌లో దుండగులు ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 19 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. 19 మందిపై నిందితులు కాల్పులకు తెగపడ్డట్టు తెలిపారు. ఘటన సమయంలో చుట్టుపక్కల అనేక సార్లు కాల్పుల శబ్దం వినపడిందని, దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలను వెల్లడించలేదు. కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై నిందితుడు కాల్పులు జరిపారు. అలాగే ఇండియానాలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గొడవ జరగగా భారత సంతతి వ్యక్తిని కాల్పి చంపారు. అంతకుముందు జూన్ 22న అర్కాన్సాస్‌లోని కిరాణా దుకాణంలో ఓ నిందితులు కాల్పులు జరపగా..ముగ్గురు మరణించగా 10 మంది గాయపడ్డారు.

Tags:    

Similar News