ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు అలర్ట్.. అది ఫేక్ న్యూస్!
ప్రస్తుత రోజుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అనేది ఎక్కువగా ఉంది. లోన్స్, ఆఫర్స్, ఉచిత స్కీమ్స్ అంటూ ఎన్నో రకాల వార్తల వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది అయోమయంలో పడిపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అనేది ఎక్కువగా ఉంది. లోన్స్, ఆఫర్స్, ఉచిత స్కీమ్స్ అంటూ ఎన్నో రకాల వార్తల వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది అయోమయంలో పడిపోతున్నారు. ఇది నిజమేనా? ఒక వేళ ఇదే నిజం అయితే మంచి అవకాశం కోల్పోతామేమో అని కొందరు కేటుగాళ్ల మాయలో పడిపోయి మోసపోతే, మరి కొందరు నకిలీ వార్తలను గుర్తించి వాటి నుంచి తప్పించుకుంటున్నారు.
అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఆడపిల్లలు, మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు ఉన్న ఇంటి వారికి గుడ్ న్యూస్ అంటూ ఓ నకిలీ కేంద్ర ప్రభుత్వం పథకం వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ని తీసుకువచ్చిందని, కన్యా శుమంగళ యోజన స్కీం . దీని ద్వారా ఆడపిల్లలు ఉన్న ఇంటికి రూ.4500 ప్రతి నెలా వస్తాయని ఒక వార్త వచ్చింది. అయితే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. సర్కారీ వ్లాగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో ఈ నకిలీ వార్త స్ప్రెడ్ చేశారు.
'Sarkari Vlog' नामक यूट्यूब चैनल के एक वीडियो में दावा किया गया है कि जिनके परिवार में बेटियां हैं उन्हें 'कन्या सुमंगला योजना' के तहत केंद्र सरकार हर महीने ₹4,500 दे रही है #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 2, 2023
➡️ यह दावा फर्जी है
➡️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/D724QS7byI