AICC: అమిత్ షా నిర్ణయానికి సంతోషిస్తున్నాం.. ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Minister Amit Sha) నిర్ణయానికి సంతోషిస్తున్నామని ఏఐసీసీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi) అన్నారు.

Update: 2024-12-30 17:19 GMT
AICC: అమిత్ షా నిర్ణయానికి సంతోషిస్తున్నాం.. ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Minister Amit Sha) నిర్ణయానికి సంతోషిస్తున్నామని ఏఐసీసీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi) అన్నారు. వయనాడ్ విపత్తు(Wayanad Disaster)ను కేంద్రం మేజర్ డిజాస్టర్ గా ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రియాంక గాంధీ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. వయనాడ్ విషాదాన్ని "తీవ్రమైన ప్రకృతి విపత్తు"(Disaster of Severe Nature)గా ప్రకటిస్తూ ఎట్టకేలకు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారని, దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అలాగే ఇది పునరావాసం అవసరమైన వారికి ఎంతో సహాయ పడుతుందని, ఈ నిర్ణయంతో సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ముందడుగు పడుతుందని తెలిపారు. ఇక అందుకు తగిన నిధులు కూడా వీలైనంత త్వరగా కేటాయించగలిగితే అందరం కృతజ్ఞులమై ఉంటామని ప్రియాంక రాసుకొచ్చారు.

Tags:    

Similar News