సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్.. 16 మందితో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ

వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది.

Update: 2023-09-04 16:48 GMT

న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా మొత్తం 16 మందిని సభ్యులుగా నియమించింది. కీలకమైన ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది. ఖర్గే నేతృత్వంలోని ఈ కమిటీకి ఎంపికైన ఇతర సభ్యుల్లో అంబికా సోనీ (ఢిల్లీ), అధిర్‌ రంజన్‌ చౌదరి (బెంగాల్), సల్మాన్‌ ఖుర్షీద్ (ఉత్తర ప్రదేశ్), మధుసూదన్‌ మిస్త్రీ (గుజరాత్), టీఎస్‌ సింగ్‌ దేవ్‌ (ఛత్తీస్ గఢ్), కేజే జార్జ్‌ (కర్ణాటక) , ప్రీతమ్‌ సింగ్‌ (ఉత్తరాఖండ్), మహమ్మద్‌ జావెద్‌ (బీహార్), అమీ యాగ్నిక్ (గుజరాత్), పీఎల్‌ పునియా (ఉత్తర ప్రదేశ్), ఓంకార్‌ మార్కం (మధ్యప్రదేశ్), కేసీ వేణుగోపాల్‌ (కేరళ) ఉన్నారు. ఈ వివరాలను కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి వెల్లడించారు. కాగా, ఇటీవల 84 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ప్రకటించారు.


Similar News