ISKCON : బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కసు.. 17 ‘ఇస్కాన్’ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం మరోసారి హిందూ సంస్థలపై విషం కక్కింది.

Update: 2024-11-30 06:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh) ప్రభుత్వం మరోసారి హిందూ సంస్థలపై విషం కక్కింది. ఇస్కాన్‌(ISKCON)తో సంబంధమున్న 17 మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇంటెలీజెన్స్ యూనిట్ (బీఎఫ్ఐయూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఖాతాలన్నీ 30 రోజుల పాటు ఫ్రీజ్ దశలో ఉంటాయని, లావాదేవీలు చేయడానికి వీల్లేదని ఆర్డర్స్‌లో పేర్కొన్నారు.

ఇస్కాన్‌కు సంబంధించిన ఆ 17 బ్యాంకు అకౌంట్ల లావాదేవీల సమాచారాన్ని మూడు రోజుల్లోగా తమకు పంపాలని బీఎఫ్ఐయూ కోరింది. ఫ్రీజ్ అయిన అకౌంట్ల జాబితాలో ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. ఆయనపై అక్టోబరు 30న దేశ ద్రోహం అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. 

Tags:    

Similar News