USA: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉగ్రదాడికి కుట్ర..!

నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అగ్రరాజ్య ఎన్నికలపైనే ప్రపంచం దృష్టి ఉంది. అయి, ఇలాంటి టైంలోనే భారీ ఉగ్రదాడి చేసేందుకు కుట్ర జరిగింది.

Update: 2024-10-09 05:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అగ్రరాజ్య ఎన్నికలపైనే ప్రపంచం దృష్టి ఉంది. అయి, ఇలాంటి టైంలోనే భారీ ఉగ్రదాడి చేసేందుకు కుట్ర జరిగింది. ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2021లో నాసిర్‌ అహ్మద్‌ తౌహేదీ(27) ప్రత్యేక వలస వీసాపై అమెరికాలో ప్రవేశించాడు. ప్రస్తుతం ఓక్లహోమా సిటీలో అతడను నివసిస్తున్నాడు. అమెరికాలో ఎన్నికల రోజున ఐసిస్ పేరుతో ఉగ్రదాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. కెమెరాలను యాక్సెస్‌ చేయడం, లైసెన్స్‌లు లేకుండా గన్‌లు దొరికే రాష్ట్రాల గురించి అహ్మద్‌ సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. అందులోభాగంగా వైట్‌ హౌస్‌, వాషింగ్టన్‌ వెబ్‌ కెమెరాలను సందర్శించినట్లు సమాచారం. రెండు ఏకే- 47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఉండే సమూహాలే లక్ష్యంగా దాడికి ప్లాన్‌ చేసినట్లు అహ్మద్‌ విచారణలో క్లారిటీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడు, అతడి సహచరులు ఆత్మాహుతిదళంగా మారిపోవాలనుకున్నట్లు తెలిపారు.

ముప్పుని ఎదుర్కొంటాం

‘అమెరికా జాతీయ భద్రతకు ఐసిస్, దాని మద్దతుదారుల నుంచి వచ్చే ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాం. అమెరికన్‌ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వ్యక్తులను గుర్తించి, విచారిస్తాం’ అని యూఎస్‌ అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లాండ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. ఈ కారణాలతో అమెరికాలో దాడులు జరిగే అవకాశం ఉందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అంచనా వేసింది. ‘ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదాతో సహా విదేశీ ఉగ్రవాద సంస్థలకు అమెరికాలో దాడులు నిర్వహించాలని, ప్రేరేపించాలనే ఉద్దేశాలు ఉన్నాయి’ అని గత నెల విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొంది.

Similar News