Aditya-L1's Stellar Progress: 'మూడోసారి ‘ఆదిత్య- ఎల్1’ భూకక్ష్య పెంపు'

సూర్యుడిపై రీసెర్చ్ చేయడానికి ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్ కు మూడోసారి భూకక్ష్యను పెంచామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఉదయం ప్రకటించింది.

Update: 2023-09-10 13:00 GMT

బెంగళూరు : సూర్యుడిపై రీసెర్చ్ చేయడానికి ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్ కు మూడోసారి భూకక్ష్యను పెంచామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఉదయం ప్రకటించింది. ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ (ఇస్ట్రాక్) శాస్త్రవేత్తలు ఈ విన్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేశారని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ఈ విన్యాసాన్ని బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, మారిషస్‌లోని ఇస్రో కేంద్రాలు ట్రాక్ చేశాయని చెప్పింది. స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం భూమికి 296 కి.మీ x 7176 కి.మీ. ఎత్తులో ఉందని తెలిపింది. ‘ఆదిత్య-ఎల్1’కు మళ్లీ సెప్టెంబరు 15న తెల్లవారుజామున 2 గంటలకు నాలుగో విన్యాసాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో పేర్కొంది.


Similar News