సీనియర్ నటి ఆస్తుల విలువ తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు

ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్ కుమార్ బీజేపీ పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-03-26 12:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సీనియర్ నటి, హీరోయిన్ రాధిక శరత్ కుమార్ బీజేపీ పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని విరుధునగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. అయితే తమిళనాడులో తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధిక శరత్ కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు ప్రస్తుతం చర్చానీయంశంగా మారింది. తన మొత్తం ఆస్తుల విలువ రూ. 53.43కోట్లు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం తన వద్ద 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, రూ.33.01 లక్షల నగదు, ఇతరములతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో తెలిపారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఆమె భర్త, నటుడు శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని (ఏఐఎస్ఎంకే) బీజేపీలో విలీనం చేశారు.

రాధిక శరత్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అంతే కాకుండా రియాలిటీ షోల్లో న్యాయనిర్ణేతగా, పలు టీవీ సిరియల్స్‌లో నటించి మెప్పించారు.

Tags:    

Similar News