మళ్లీ రాజకీయాల్లోకి గోవింద.. ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ!
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. గురువారం మధ్యాహ్నం శివసేన (షిండే) పార్టీ కండువాను గోవింద కప్పుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గోవిందకు నార్త్-వెస్ట్ ముంబై టికెట్‌ను ఇవ్వాలని షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో రెండుసార్లు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో భేటీ అయిన గోవింద లోక్‌సభ టికెట్ కేటాయింపు అంశంపై చర్చించారు. నార్త్-వెస్ట్ ముంబై టికెట్ కేటాయింపుపై ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వడంతో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. నార్త్-వెస్ట్ ముంబై స్థానం నుంచి శివసేన (ఉద్ధవ్) వర్గం అభ్యర్థిగా అమోల్ కీర్తికర్ బరిలోకి దిగారు. ఆయన్ను ఢీకొట్టాలంటే గోవింద తరహా స్టార్ నేపథ్యం కలిగిన వారైతేనే బెటర్ అనే ఒపీనియన్‌కు సీఎం షిండే వచ్చారట. గతంలోకి వెళితే.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్యానర్‌పై గోవింద ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2009 నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.