మేధా పాట్కర్‌కు విధించిన శిక్ష ఉత్తర్వులను జులై 1కి రిజర్వు చేసిన కోర్టు

నిందితులకు శిక్ష పడిన అనంతరం బాధిత వ్యక్తికి జరిగిన అష్టాన్ని అంచనా వేసేందుకు నివేదిక రూపొందించబడింది.

Update: 2024-06-07 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పరువునష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్‌’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును జూలై 1కి రిజర్వ్ చేస్తూ కోర్టు రిజర్వు చేసింది. ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ(డీఎల్ఎస్ఏ) బాధితుల ప్రభావ నివేదిక(వీఐఆర్)ను సమర్పించిన తర్వాత మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. నిందితులకు శిక్ష పడిన అనంతరం బాధిత వ్యక్తికి జరిగిన అష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నివేదిక రూపొందించబడింది. 2000 నాటికి చెందిన ఈ కేసును ప్రస్తుతం ఢిల్లీ లెఫ్ట్‌నెట్ గవర్నర్‌గా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషిగా తేలినవారికి రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మేధా పాట్కర్‌, వీకే సక్సేనాల మధ్య ఈ న్యాయపోరాటం 2000 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తనతో పాటు నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలతో వీకే సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో వీకే సక్సేనా అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. దాంతో ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ మేధా పాట్కర్‌పై ఆయన సైతం రెండు కేసులు దాఖలు చేశారు. 


Similar News