ED : తాత్కాలిక ఈడీ డైరెక్టర్‌‌ రాహుల్ నవీన్‌కు పదోన్నతి

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ నవీన్‌ను పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Update: 2024-08-14 17:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ నవీన్‌ను పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఈడీ డైరెక్టర్ పదవిలో ఆయన కొనసాగుతారని వెల్లడించింది. 57 ఏళ్ల రాహుల్ నవీన్ 2019 నవంబరులో స్పెషల్ డైరెక్టర్‌ హోదాలో ఈడీలో చేరారు. ఈయన 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. గతేడాది సెప్టెంబరులో ఆయన ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రాహుల్ నవీన్ ఈ బాధ్యతలను చేపట్టిన తర్వాతే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ల అరెస్టులు జరిగాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఫెమా చట్టాలతో ముడిపడిన ఆర్థిక నేరాలను ఈడీ దర్యాప్తు చేస్తుంటుంది.

Tags:    

Similar News