Kerala CM పినరయి విజయన్‌ కాన్వాయ్‌కి యాక్సిడెంట్

కేరళ సీఎం పినరయి విజయన్‌(Kerala CM Pinarayi Vijayan) కాన్వాయ్‌కి ప్రమాదం(Accident) జరిగింది.

Update: 2024-10-28 14:28 GMT

దిశ, వెబ్ డెస్క్: కేరళ సీఎం పినరయి విజయన్‌(Kerala CM Pinarayi Vijayan) కాన్వాయ్‌కి ప్రమాదం (Accident) జరిగింది. తిరువనంతపురంలోని వామనపురంలో ఓ కార్యక్రమానికి రోడ్డు మార్గంలో వెళ్లి వస్తుండగా స్కూటర్ అడ్డు వచ్చింది. దీంతో ముందు వాహన అత్యవసరంగా బ్రేకులు వేయడంతో సీఎం కారుతో పాటు కాన్వాయ్ లోని ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదు ఎస్కార్ట్ వాహనాలు(Escort vehicles) ధ్వంసం కాగా.. సీఎం పినరయి విజయన్‌ (CM Pinarayi Vijayan)కు ఏమి కాకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సీఎం కాన్వాయ్( CM Convoy ) అక్కడి నుంచి వెళ్లిపోగా.. పాక్షికంగా ధ్వంసం అయిన ఓ పోలీసు వాహనాన్ని పక్కకు నెట్టి మిగిలిన కాన్వాయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.


Similar News