Breaking News : గుట్కాపై మరో ఏడాది నిషేధం పొడిగించిన ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-10-28 16:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఏడాదిపాటు గుట్కా(Gutka), పాన్ మ‌సాలా(Pan Masala)పై నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పొగాకు లేదా నికోటిన్‌తో త‌యారు అయ్యే గుట్కా, పాన్ మ‌సాలా వంటి వాటిని త‌యారు చేయడం, దాచిపెట్టడం, అమ్మడం నేరంగా ప‌రిగ‌ణిస్తారు. న‌వంబ‌ర్ 7వ తేదీ నుంచి ఈ నిషేధ ఆదేశాలు అమ‌లులోకి రానున్నాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజ‌ల ఆరోగ్యం దృష్ట్యా.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఫుడ్ సేఫ్టీ చ‌ట్టంలోని సెక్షన్-30, స్టాండ‌ర్డ్స్ యాక్ట్ ప్రకారం చ‌ర్యలు తీసుకోనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News