Supreme Court: కోర్టు ధిక్కరణ కేసులో రాందేవ్ బాబాకు ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో యోగాగురు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కు ఊరట లభించింది.

Update: 2024-08-13 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోర్టు ధిక్కరణ కేసులో యోగాగురు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కు ఊరట లభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటన వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ పై కేసుని కోర్టు మూసివేసింది. పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ, బాబారాందేవ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు గతంలోనే బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇకపై అలాంటి యాడ్స్‌ ఇవ్వబోమని కోర్టుకు వెల్లడించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. వారిపై కోర్టుధిక్కరణ కేసుని మూసివేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తప్పుదోవ పట్టించే యాడ్స్ పై కేసు

హల్లోపతి వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి (Patanjali)పై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. ఉల్లంఘనలు జరగవని.. పతంజలి తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టుపై ధిక్కరణ చర్యలు చేపట్టింది. దీంతో, రాందేవ్ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు. వాటిని అంగీకరించని అత్యున్నత న్యాయస్థాం.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఆతర్వాత కేసుని మూసివేసింది.


Similar News