AAP MLA Amanatullah Khan : ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాకు షాక్.. 14 రోజుల కస్టడీ

దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల (సెప్టెంబరు 23 వరకు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Update: 2024-09-09 18:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మనీలాండరింగ్ కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల (సెప్టెంబరు 23 వరకు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డులో నియామకాలు, రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజులో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈనెల 2న అమానతుల్లా ఖాన్‌‌‌ను అరెస్టు చేసి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. తొలుత నాలుగు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

అనంతరం మరో మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. తాజాగా సోమవారం రోజు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట అమానతుల్లాను హాజరుపర్చింది. ఆయనను విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు ఈడీ తెలిపింది. దీంతో అమానతుల్లాను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Similar News