‘ఆప్’ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది వీరే..

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున స్వాతి మలివాల్, సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Update: 2024-01-12 16:23 GMT
‘ఆప్’ నుంచి రాజ్యసభకు ఎన్నికైంది వీరే..
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున స్వాతి మలివాల్, సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. శుక్రవారం రోజు రిటర్నింగ్ అధికారి వీరికి గెలుపు పత్రాలను అందజేశారు. ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. దీంతో వీరిలో సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను 'ఆప్' నామినేట్ చేసింది. ఆప్ నామినేట్ చేసిన ముగ్గురు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.

Tags:    

Similar News