మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు..!

ఆమ్ ఆద్మీ నేతలకు ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన నెలలోపే.. మరో కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు అయ్యాడు.

Update: 2024-04-18 18:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ నేతలకు ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన నెలలోపే.. మరో కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు అయ్యాడు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్య అమానతుల్లా నివాసంలో ఢిల్లీ మంత్రి అతిషీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నట్లు ఆప్ అధికార ఎక్స్ అకౌంట్ లో పోస్టులు పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ విఫల ప్రయత్నాల్లో మరో అధ్యాయం అని ఆ పోస్టుకు జత చేశారు.

ఇకపోతే, 2018 నుంచి 2022 మధ్య వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్నారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది ఈడీ. బోర్డులోని సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చేసి.. డబ్బు సంపాధించిందని పేర్కొంది. తన అనుచరుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే డబ్బును పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో అమానతుల్లా ఖాన్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించడంతో పాటు ఈరోజే విచారణలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. అయితే, అరెస్టు చేసే హక్కును అనవసరంగా వాడుకోవద్దని ఈడీని హెచ్చరించింది సుప్రీంకోర్టు.

మరోవైపు, ఏడాదిన్నరగా కేంద్ర ఏజెన్సీలు తనను ఇబ్బందిపెడ్తున్నాయని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఈడీ భావిస్తుందని.. దానికి ఒప్పుకోనందుకే తనని అరెస్టు చేశారని విమర్శించారు. గతంలో చేసినట్లుగానే ఎప్పటికీ ఓఖ్లా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే.


Similar News