ఫస్ట్ AI వర్చువల్ న్యూస్ యాంకర్ గా ‘సన’

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.

Update: 2023-03-31 12:10 GMT

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక ఈ టెక్నాలజీ వినియోగం వార్తా రంగంలో కూడా పెరిగిపోయింది. ఇప్పుడంతా డిజిటల్ మీడియా హవా నడుస్తోంది. కాగా తాజాగా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దీనికి ‘ఆజ్ తక్’ న్యూస్ మీడియా వేదికగా నిలిచింది. ఈ సంస్థ వార్తలు చదివేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్చువల్ న్యూస్ యాంకర్ ను ప్రవేశపెట్టింది. ఆ లేడీ యాంకర్ కు ‘సన’ అని నామకరణం చేసింది. ఇక ఈ కొత్త యాంకర్ ‘బ్లాక్ అండ్ వైట్’ అనే న్యూస్ బులెటిన్ ద్వారా అరంగేట్రం చేసింది. 

https://www.linkedin.com/posts/exchange4media_aajtak-activity-7047497630507003904-XPM5?utm_source=share&utm_medium=member_android


Tags:    

Similar News