జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగిన ఆధార్-ఆధారిత లావాదేవీలు

జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆధారిత లావాదేవీలు 2024 ఆర్థిక సంవత్సరంలో అనేక రేట్లు పెరిగినట్లు ఫిన్‌టెక్ స్టార్ట్-అప్ PayNearby నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది.

Update: 2024-05-30 09:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆధారిత లావాదేవీలు 2024 ఆర్థిక సంవత్సరంలో అనేక రేట్లు పెరిగినట్లు ఫిన్‌టెక్ స్టార్ట్-అప్ PayNearby నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది. ఎఫ్‌వై24లో కాలంలో జమ్మూకశ్మీర్ రిటైల్ దుకాణాల్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ 134 శాతం వృద్ధిని కనబరిచింది. అక్కడి రిటైల్ స్టార్లలో మైక్రో ATM లావాదేవీలు విలువ, వాల్యూమ్ రెండింటిలోనూ 31 శాతం పెరుగుదల ఉందని నివేదిక తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆధార్-ఆధారిత చెల్లింపు లావాదేవీ విలువలో 1000 శాతం పెరుగుదలతో మేఘాలయ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఉందని సర్వే పేర్కొంది. అలాగే 712 శాతం పెరుగుదలతో నాగాలాండ్, అస్సాం తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

అదనంగా, మిజోరాం, మేఘాలయలోని మైక్రో ఏటీఎంలలో లావాదేవీ విలువ వరుసగా 55 శాతం, 43 శాతం పెరగ్గా, వాల్యూమ్ వరుసగా 33 శాతం, 43 శాతం పెరిగింది. రిటైల్ అవుట్‌లెట్లలో UPI QR కోడ్‌లపై లావాదేవీలు 84 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది . మొత్తం ఆర్థిక, డిజిటల్ లావాదేవీల పరంగా అస్సాం మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

డేటా ప్రకారం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు ఈ-కామర్స్ లావాదేవీల్లో అత్యధిక వృద్ధిని సాధించాయి. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు, పంజాబ్ కూడా రిటైల్ స్టోర్ల ద్వారా MSME రుణాలను పంపిణీ చేయడంలో 29 శాతం పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక చూపించింది. PayNearby MD, CEO ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంలో రిటైల్ అవుట్‌లెట్‌ల కీలక పాత్రను ఇది ప్రతిబింబిస్తుంది, బ్యాంకు శాఖలు లేని ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సులభంగా యాక్సెస్ అందిస్తాయని అన్నారు.


Similar News