తమిళనాడులో ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఇంతకూ ఏంటా స్పెషల్..

సాధారణంగా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవుని వద్ద తొమ్మిది రోజులు పూజలందుకున్న లడ్డూను వేలం వేస్తుంటారు.

Update: 2024-03-10 11:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణంగా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవుని వద్ద తొమ్మిది రోజులు పూజలందుకున్న లడ్డూను వేలం వేస్తుంటారు. చాలా మంది ఈ వేలంలో పాల్గొని ఎక్కువ ధరకు లడ్డును దక్కించుకుంటారు. ఇదే విధంగా తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి నిమ్మకాయ, పండ్లతో పాటు ఇతర వస్తువులతో ప్రత్యేక పూజలు చేశారు. అయితే అక్కడి ఆచారం ప్రకారం, పూజానంతరం వాటిని వేలం వేస్తుంటారు. ఇటీవల జరిగిన వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలందుకున్న నిమ్మకాయను రూ.35,000లకు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి పీఠాధిపతి పూజ నిర్వహించి ఆ భక్తుడికి అందజేశారు. వేలంలో నిమ్మకాయ ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.


Similar News