ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ముద్దులను డెలివరీ చేసిన బాయ్
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి ఇంటి నుంచి కదలకుండా సకల వసతులను కల్పించుకుంటున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి ఇంటి నుంచి కదలకుండా సకల వసతులను కల్పించుకుంటున్నాడు. తనకు కావల్సిన ప్రతి వస్తువును ఆన్‌లైన్ ద్వారా రప్పించుకుంటున్నాడు. ఇక ఫుడ్ యాప్‌లు వచ్చాక కొంత మంది వంటలు చేయడమే మానేశారు. ఏది తినాలనిపించినా.. క్షణాల్లో ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు. అయితే కొంత మంది కన్నింగ్ బుద్ది ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్స్ దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. పోసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని పుణె నగరంలో యేవెల్వాడి ప్రాంతంలో 19 ఏళ్ల యువతి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. అయితే దానిని ఇచ్చేందుకు వచ్చిన 42 ఏళ్ల వ్యక్తి ఫుడ్ ఇచ్చి ఆమెపై కన్నేశాడు. యువతితో మాటలు కలపడానికి మంచి నీళ్లు కావాలని అడిగాడు. ఈ క్రమంలో మెళ్లగా యువతి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి చదువుకోవడానికి వచ్చి తన స్నేహితులతో కలిసి ఉంటున్నానని.. ప్రస్తుతం వాళ్లు ఊరికి వెళ్లారని చెప్పింది. దీంతో ఒంటరిగా ఉందని గ్రహించిన ఫుడ్ డెలివరీ బాయ్.. యువతిని గట్టిగా పట్టుకొని చెంప పై రెండు సార్లు ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆమెకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. అది భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు డెలివరీ బాయ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.