Central Government: సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం
నిత్యావసర వస్తువుల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమవుతుంది.
దిశ, వెబ్ డెస్క్ : నిత్యావసర వస్తువుల పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమవుతుంది.పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. ఇటీవల కంది పప్పును, మినపప్పు ధరలు పెరిగిన విషయం మనకీ తెలిసిందే. నిత్యావసర సరుకుల పై స్టాక్ లిమిట్స్ నిర్ణయం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కంది పప్పు ధర కేజీ రూ. 122 గా ఉంది. అలాగే మినపప్పు ధర దీని ధర కేజీకి రూ. 110గా ఉంది. ఈ ధరల పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొని అతి త్వరలో సామాన్యులకు శుభ వార్త చెప్పనుంది.