70 ఏళ్ల వృద్దురాలిపై హత్యాచారం.. ఆపై ఏం చేశాడో తెలిస్తే షాక్!

బెంగాల్ లో జరిగిన ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది.

Update: 2024-08-26 17:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్ లో జరిగిన ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరవక ముందే.. మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు.. బొర్గావ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్దురాలు కొద్దిరోజుల క్రితం బెటా గ్రామానికి వచ్చింది. భార్య వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఓ యువకుడు.. తన ఇంట్లో నివాసం ఇస్తానని వృద్దురాలిని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్రపోయిన సమయంలో వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేశాడు. హత్య అనంతరం వృద్దురాలి శవంతో అతడు రెండు రోజులూ అదే ఇంట్లో ఉన్నాడు. దుర్వాసన రావడాన్ని గమనించిన గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకుని ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు పట్టలేని విధంగా వృద్దిరాలి శవం ఉబ్బిపోయి ఉంది. నిండుతుణ్ణి అదుపులోకి తీసుకొని విచారించగా.. వృద్దురాలిపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు యువకుని మానసిక స్థితి సరిగా లేనట్టు తెలుస్తోందన్నారు.  


Similar News