అమెరికాలో భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల: ప్రపంచ బ్యాంక్

అమెరికాలోని తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది.

Update: 2023-04-26 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయుల ఆదాయంలో 500% పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఆదాయం.. 120% పెరిగిందని, అంతర్గతంగా వలస వెళ్లిన భారతీయుల ఆదాయంలో 40% పెరుగుదల ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా.. అమెరికా ప్రాంతాలకు వలస వెళ్లే తక్కువ నైపుణ్యం కలిగిన భారతీయులు తమ ఆదాయంలో 500% పెరుగుదలను చూడవచ్చని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అలాగే UAEకి వలస వెళ్ళే వారి ఆదాయం దాదాపు 300% పెరగవచ్చని అంచనా వేసింది.

Tags:    

Similar News