Odisha: ఒడిశాలో సీఎం-కిసాన్ యోజన పథకం ప్రారంభించిన సీఎం మాఝీ

పథకం ద్వారా భూమిలేని వారితో సహా 46 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది

Update: 2024-09-08 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో సీఎం-కిసాన్ యోజన పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం ప్రారంభించారు. ఆదివారం గంగాధర్ మొహర్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సీఎం-కిసాన్ యోజన పథకం ద్వారా భూమిలేని వారితో సహా 46 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. నుఖాయ్ శుభ సందర్భంగా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులందరికీ రూ. 925 కోట్ల విలువైన మొత్తాన్ని డీబీటీ ద్వారా వారి ఖాతాలకు బదిలీ అవుతుంది. అర్హులైన రైతులకు రెండు దశల్లో మొత్తం రూ. 4,000 అందించడం జరుగుతుంది. మొదటి విడత రూ. 2,000 నువాఖయ్‌లో పంపిణీ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని అక్షయ తృతీయ నాడు అందించనున్నట్టు చెప్పారు. 'నుఖాయ్ నుంచి రబీ పంటకు సన్నాహాలు ప్రారంభమైనందున, పథకం డబ్బులు రైతులకు లభిస్తాయి. దీంతో రైతులు వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ముందుగానే కొనుగోలు చేయవచ్చు' అని సీం మాఝీ చెప్పారు. అంతేకాకుండా సీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల పిల్లలకు సాంకేతిక విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుందని మాఝీ తెలిపారు. ఇదే సందర్భంగా ఒడిశాలోని సంబర్‌పూర్‌లో రెండో ఎయిమ్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ముందు దీనికి సంబంధించి డిమాండ్ ప్రతిపాదించిందన్నారు. 

Tags:    

Similar News