ఘోర ప్రమాదం.. కూలిన 3 అంతస్థుల బిల్డింగ్.. నలుగురు మృతి

మూడంతస్థుల బిల్డింగ్ ఉన్నట్లుండి కూలి నలుగురు మరణించిన ఘోర ఘోర ప్రమాదం ఉత్తరప్రదేశ్‌‌‌లో చోటు చేసుకుంది.

Update: 2024-09-07 14:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ (UttaraPradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్థుల బిల్డింగ్ ఉన్నట్లుండి కూలిపోవడంతో నలుగురు మరణించారు. ఇంకొంతమంది ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది మెరుపువేగంతో క్షతగాత్రులను రక్షిస్తున్నారు. ఇప్పటివరకు 28 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మరికొంతమంది శిథిలాల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. యూపీ రాజధాని లక్నో (UttarPradesh Capital Lucknow)లోని ట్రాన్స్‌పోర్ట్‌ నగర్ (Transport Nagar)లో ఉన్న మూడంతస్థుల బిల్డింగ్ బేస్‌మెంట్‌లో మరమ్మతులు నిర్వహిస్తున్నారు. అదే టైంలో ఉన్నట్లుండి పిల్లర్లు విరిగి బిల్డింగ్ పక్కకు కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ బృందాలు అక్కడకు చేరుకుని హుటాహుటిన రక్షణ చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనలో నలుగురు మరణించారని, 28 మంది వరకు శిథిలాల నుంచి రక్షించిన ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.

కాగా.. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh CM Yogi Adityanath) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వేగంగా రెస్య్కూ ఆపరేషన్ ముగించాలని సూచించారు. కాగా.. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 


Similar News