Metro Rail project: అహ్మదాబాద్‌‌ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైళ్లో విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు.

Update: 2024-09-16 15:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత.. ప్రధాని మోడీ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైళ్లో విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కీలక ప్రాంతాల మధ్య పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణం ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జీఎంఆర్‌సీ) రెండో దశ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెట్రో కోసం మొత్తం రూ. 5,384 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను ఏఎఫ్‌డీ(ఫ్రాన్స్), కేఎఫ్‌డబ్ల్యూ(జర్మనీ)తో పాటు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా సేకరించారు. ఈ మెట్రోతో అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య సుమారు 25 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. 

Tags:    

Similar News