Sex Scandal Case: ప్రజ్వల్, హెచ్డీ రేవణ్ణపై రెండువేల పేజీల ఛార్జిషీటు
లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై.. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఛార్జిషీటు దాఖలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్డీ రేవణ్ణపై.. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఛార్జిషీటు దాఖలు చేసింది. ప్రస్తుతం, ప్రజ్వల్‌పై నమోదైన నాలుగు కేసులను సిట్ దర్యాప్తు చేస్తోంది. సుమారు రెండు వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సిట్ చెప్పింది. ప్రత్యేక కోర్టులో 2,144 పేజీల చార్జిషీట్‌ను సమర్పించింది. చార్జిషీట్ దాఖలుకు ముందు నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు సిట్ పేర్కొంది. దీని కోసం 150 మంది సాక్ష్యులను విచారించారు. ఇంట్లో పనిమనిషిపై లైంగిక దాడి జరిగినట్లు నమోదు చేసిన కేసులో ఛార్జీషీట్ ను సిట్ సమర్పించింది.
ఆధారాలు సేకరించిన సిట్
స్పాట్ ఇన్స్పెక్షన్, బయోలాజికల్, ఫిజికల్, సైంటిఫిక్, మొబైల్, డిజిటల్, ఇతర ఆధారాలను సేకరించినట్లు సిట్ తెలిపింది మే 31న ఈ కేసులో అరెస్టయినప్పటి నుంచి ప్రజ్వల్ రేవణ్ణ జైలులోనే ఉన్నాడు. మరోవైపు, జేడీ(ఎస్) అధిష్ఠానం ప్రజ్వల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తనపై నమోదైన కేసుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ కుమారుడు ఎమ్మెల్యే రేవణ్ణపై ఐపీసీలోని సెక్షన్ 354, 354(ఏ) కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్‌పై 376, 376(2)(కే), 354, 354(ఏ), 354(బీ) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ప్రజ్వల్ ఇంట్లో పనిచేసే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు రావడం గమనార్హం.