18 అడుగుల బంగారు వినాయక విగ్రహం(Ganesh idol )
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవిత ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. అనంత చతుర్దశి నాడు ముగిసే 10-రోజుల పండుగ రెండు సంవత్సరాల కరోనా తర్వాత వస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి వేడుకలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వినాయకుని భక్తులు పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి.. భారీ గనణాథులను ప్రతిష్టించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని చందౌసిలో భారీ బంగారు వినాయకుడిని తయారు చేస్తున్నారు.
18 అడుగుల ఎత్తు గల బంగారు పడకలతో కూడిన విగ్రహాన్ని ఉత్సవ సమితి తయారు చేస్తోంది. ఈ వినాయక విగ్రహాన్ని తిరుపతి బాలాజీ తరహాలో బంగారు అలంకార వస్తువులతో సిద్ధం చేస్తున్నట్లు విగ్రహం చేస్తున్న వ్యక్తి అజయ్ ఆర్య తెలిపారు. అయితే ఈ విగ్రహానికి ఎంత బంగారం ఉపయోగించారు అనే దానిపై పూర్తి వివరాలను వారు వెల్లడించలేదు.