15ఏళ్ల బాలిక.. 12ఏళ్ల బాలుడు.. మూడోసారి పరార్.. తలలు పట్టుకుంటున్న పోలీసులు

ఓ 15 ఏళ్ల అమ్మాయి అటు తల్లిదండ్రులకి, ఇటు పోలీసులకి చుక్కలు చూపించింది. ఏకంగా 12 ఏళ్ల అబ్బాయితో పారిపోయి అందరికీ షాకిచ్చింది.

Update: 2024-10-10 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ 15 ఏళ్ల అమ్మాయి అటు తల్లిదండ్రులకి, ఇటు పోలీసులకి చుక్కలు చూపించింది. ఏకంగా 12 ఏళ్ల అబ్బాయితో పారిపోయి అందరికీ షాకిచ్చింది. ఇంకా షాకిచ్చే విషయం ఏంటంటే.. ఇలా ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోవడం ఇది మూడోసారి. ప్రస్తుతం పోలీసులు ఆమెని వెతికే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని దర్‌భంగా జిల్లాకి చెందిన ఓ వ్యక్తి తన కూతుళ్లకి మంచి చదువు చెప్పించాలని భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి సొంతూరిని వదిలిపెట్టి నోయిడాకి వచ్చాడు. ప్రస్తుతం పెద్ద కుమార్తె వయసు 15 ఏళ్లు కాగా.. చిన్న కుమార్తె వయసు 12 ఏళ్లు. ఇద్దరికీ కష్టపడి చదువు చెప్పిస్తున్నాడు. అయితే కొన్నేళ్లుగా తన పెద్ద కూరుతు ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఇంట్లో ఎవరి మాట వినకపోగా పారిపోతోందని చెప్పారు.

తాజాగా ఇంటి ఎదురుగా ఉండే ఓ 12 ఏళ్ల బాలుడితో పారిపోవడంతో ఆ తండ్రి ఏడుస్తూ పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తెను వెతికి పెట్టాలని వేడుకున్నాడు. దీంతో ఇప్పటికే రెండుసార్లు ఆమెని వెతికి కుటుంబానికి అప్పగించిన పోలీసులు తలలు పట్టుకున్నారు.

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. మొదటిసారి ఆ అమ్మాయి ఇంటిపక్కన ఉండే మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు పోలీసులు వారం రోజులు కష్టపడి జైపూర్‌లోని బృందావనం ప్రాంతంలో ఆమెను పట్టుకుని తిరిగి తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ సారి ఇంటి ఎదురుగా ఉండే 12 ఏళ్ల బాలుడితో కలిసి పారిపోయింది. దీంతో తల్లిదండ్రులు మళ్లీ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కూడా కష్టపడి వెతికి ఆమెని పట్టుకొచ్చి కుటుంబానికి అప్పగించారు.

కుమార్తె తీరును భరించలేని ఆ తండ్రి ఆమె చెడు అలవాట్లతో విసుగు చెంది నోయిడా నుంచి తిరిగి సొంతూరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇంట్లో సామాన్లు ప్యాక్ చేసి ఆటోలో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. పెద్ద కుమార్తె కనిపించకుండా పోయింది. ఇంటి ఎదురుగా ఉండే 12 ఏళ్ల బాలుడు కూడా మిస్సయ్యాడు. దీంతో మళ్లీ ఆ కుర్రాడితో కలిసి పారిపోయినట్లు అనుమానించిన తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా ఈ సారి తలలు పట్టుకుని మళ్లీ ఆమెను వెతికే పనిలో పడ్డారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ తెలియరాలేదు.


Similar News