తమపై ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా.. కమలం మరింత వికసిస్తుంది : అమిత్ షా
బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్, ఆప్‌లపై విరుచుకపడ్డారు. దేశం మొత్తం ప్రధాని మేలు కోరుకుంటుంటే.. ఆప్, కాంగ్రెస్‌ల అభ్యంతరకర నినాదాదాలు ఏమి చేయలేవని విమర్శించారు. ఆయన కోసం 130 కోట్ల మంది ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం కర్ణాటక లో బహిరంగ సమావేశం లో అమిత్ షా మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు గెలిచేందుకు ఎలాంటి వనరులు లేకుండా పోయాయి. రాహుల్ నాయకత్వంలో పార్టీ తీవ్రంగా దిగజారిపోయింది. వీరు మోడీ కి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఆప్ నేతలు చావును కోరుకుంటున్నారు. దైవం వీటిని వినిపించుకోదు. ఎందుకంటే ప్రధాని కి 130 కోట్ల మంది ప్రార్థనలు ఉన్నాయి’ అని అన్నారు.
తమపై ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా, కమలం మరింత వికసిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానిని ఎంత తిట్టినా, విజయం సాధించలేరని అన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పొత్తు స్వీయ ప్రయోజనలకేనని విమర్శించారు. సిద్ధరామయ్య అవినీతి ని ప్రోత్సహిస్తూ.. ఢిల్లీలోని కుటుంబానికి ఏటీఎం వలె ఉన్నారని చెప్పారు. ఈశాన్యంలో కాషాయం ప్రవేశించదని విమర్శించిన వారికి తాజా ఫలితాలు సమాధానం ఇచ్చాయని తెలిపారు.
Also Read..