మూలుగుతున్న ‘జల్ జీవన్’ నిధులు.. రాష్ట్రాల వద్ద నిరుపయోగంగా రూ.16,484 కోట్లు: ప్రహ్లాద్ సింగ్

Update: 2023-08-07 14:26 GMT

న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం విడుదల చేసిన రూ.16,484 కోట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద నిరుపయోగంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2024 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన, తగినంత తాగు నీరు అందించడం ఈ మిషన్ లక్ష్యం అన్నారు.

నీళ్లు రాష్ట్రం పరిధిలోని అంశం అయినందున నీటి సరఫరా పథకాలను ప్లాన్ చేయడం, అమలు చేయండం, నిర్వహించడం రాష్ట్రాల పని అని కేంద్ర జల శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాజ్యసభలో సోమవారం ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద మహారాష్ట్ర రూ.2,401 కోట్లు, రాజస్థాన్ రూ.1,552 కోట్లు, కర్ణాటక రూ.1,225 కోట్లు ఖర్చు చేశాయన్నారు.


Similar News