Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2024-10-19 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంకా జాతీయ రహదారిపై ఓ బోలెరో ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గ్రామస్థులపైకి మెరుపు వేగంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.    


Similar News