‘సెకండ్ వేవ్‌ ఎఫెక్ట్.. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదు’

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. దాని ఫలితంగా ప్రస్తుతం లాక్‌డౌన్ విధించాల్సిన స్థితికి దేశం నెట్టబడిందని వివరించారు. సెకండ్ వేవ్‌ విలయతాండవం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుక్రవారం మరో లేఖ రాశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన, పటిష్టమైన స్ట్రాటజీని అమలు చేయలేకపోయిందని, అందువల్లే దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుందని ఆరోపించారు. అదే లేఖలో ఆయన […]

Update: 2021-05-07 08:04 GMT

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. దాని ఫలితంగా ప్రస్తుతం లాక్‌డౌన్ విధించాల్సిన స్థితికి దేశం నెట్టబడిందని వివరించారు. సెకండ్ వేవ్‌ విలయతాండవం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శుక్రవారం మరో లేఖ రాశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన, పటిష్టమైన స్ట్రాటజీని అమలు చేయలేకపోయిందని, అందువల్లే దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుందని ఆరోపించారు. అదే లేఖలో ఆయన పీఎంకు నాలుగు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను శాస్త్రీయంగా ట్రాక్ చేయాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా దాని మ్యుటేషన్‌లనూ ఎప్పటికప్పుడు పరిశీలించాలని మొదటి సూచనగా పేర్కొన్నారు.

కొత్త మ్యుటేషన్‌ కోసం టీకాలన్నింటినీ పరిశీలించాలని తెలిపారు. అత్యంత వేగంతో ప్రజలకు టీకా పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే, ఈ క్రమంలో కనుగొన్న నూతన విషయాలను పారదర్శకంగా బయటి ప్రపంచానికి తెలియజేయాలని నాలుగో సూచనగా ప్రధానికి వివరించారు. వీటితోపాటు ప్రపంచంలో భారత బాధ్యతను గుర్తెరగాలని, భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మనదేశంలోనే ఉన్నారని తెలిపారు. జన్యు వైవిధ్యత, భారీ జనాభా లాంటి సంక్లిష్టతలు దేశంలో వైరస్ కొత్తరూపాలు సంతరించుకుని మరింత ప్రమాదకారిగా మారడానికి దోహపడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్‌లు ప్రారంభమే కావొచ్చు, అసలు ముప్పు ఇంకా ముందుండవచ్చునన్న భయాలను ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News