మొదటగా జాతీయ జెండాను ఇక్కడే రూపొందించారు
దిశ, సూర్యాపేట: త్రివర్ణ పతాకం ఆవిర్భవించి నేటికీ 73 సంవత్సరాలు పూర్తయింది. 1947 జులై 22న జాతీయ జెండాపై రాజ్యాంగ సభలో తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ జాతీయ జెండా రూపకల్పన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజాగారి కోటలో 1926లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని మధ్యలో ఏర్పాటు చేసి జాతీయ జెండాను అమలు చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి […]
దిశ, సూర్యాపేట: త్రివర్ణ పతాకం ఆవిర్భవించి నేటికీ 73 సంవత్సరాలు పూర్తయింది. 1947 జులై 22న జాతీయ జెండాపై రాజ్యాంగ సభలో తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ జాతీయ జెండా రూపకల్పన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి రాజాగారి కోటలో 1926లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలోని అశోక చక్రాన్ని మధ్యలో ఏర్పాటు చేసి జాతీయ జెండాను అమలు చేశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి. జాతీయ ఉద్యమ నాయకుడు ఆ స్వాతంత్రోద్యమ కార్యసిద్ధి చేతిలోనే జాతీయ పతాకం రూపుదిద్దుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జాతీయ పతాకం తెలంగాణలోనే రూపొందించారన్న విషయం కొంతమందికే తెలుసు.
కూలుతున్న మువ్వన్నెల జెండా భవనం
1875లో జమిందారీ భాద్యతలు “రుక్కమ్మ” అనే వ్యక్తి చేపట్టింది. ఆమె హయాంలో నడిగూడెంలో ఉన్న ప్రస్తుత రాజావారి కోట (గడి) నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. మువ్వన్నెల జెండా అంటే మూడు రంగుల జెండా.. ఈ జెండా ఇప్పుడు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది. కానీ ఆ రంగుల జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య నివసించిన భవనం నేడు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. జాతీయ జెండా రూపకల్పనకు వేదిక అది. పింగళి వెంకయ్య మువ్వన్నెల పతాకాన్ని రూపొందించింది ఇక్కడే. జమిందార్ల పాలనలో ఆనాడు రాజ భవనంగా కళకళలాడింది. ఇప్పుడు మాత్రం పట్టించుకునే నాథుడే లేక వెలవెలబోతోంది. మువ్వన్నెల పతాకం 125 కోట్ల మంది భారతీయులు సగర్వంగా నమస్కరించే జెండా. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపు దిద్దుకుంది ఈ భవనంలోనే. ఈ కోట గదుల్లోనే పింగళి వెంకయ్య మూడు జాతీయ జెండాకు రంగులద్దారు.
స్వాంతంత్ర్యానికి ముందు జమిందార్లుగా ఉన్న రంగారావు కుటుంబీకులు ఇక్కడి నుంచే పరిపాలన సాగించేవారు. నాడు కృష్ణా జిల్లాల్లో ఉన్న నడిగూడెం పరగణాలో రైతులకు పత్తి పంట పండించడంలో మెళకువలు నేర్పడానికి పింగళి వెంకయ్య ఈ ప్రాంతానికి వచ్చారు. పత్తి పండించడం, దానితో బట్టలు నేయటం వంటి పనులు ఇక్కడ నేర్పుతున్న సమయంలోనే మహాత్మా గాంధీ జాతీయ జెండా రూపకల్పనకు పిలుపునిచ్చారు.
మహాత్ముడి పిలుపుతో అశోక చక్రం మధ్యలో ఉంచి మూడు రంగుల జెండాకు రూపాన్నిచ్చారు పింగళి వెంకయ్య. ఆనాటి కాకినాడ కాంగ్రెస్ మహాసభలో ఈ జెండానే జాతీయ పతాకంగా ఎంపిక చేశారు. చారిత్రక ఘటనకు వేదికైన ఆనాటి ఈ రాజ భవనం నేడు మాత్రం పూర్తిగా శిధిలావస్ధకు చేరుకుంది. నాటి కళా నైపుణ్యం కళ్లకు కట్టేలా అద్భుతంగా తిర్చిదిదగా ఈ కట్టడంలో ఇప్పుడు ఆనవాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ భవనం శిథిలం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
పత్తి వెంకయ్య 1916 నుండి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల పరగణా నడీగూడెంలో జమీందారు రాజా బహదూర్ నాయని రంగారావు కోరిక మేరకు నడిగూడెంలో నివాసం ఉండి పత్తి మొక్కలలోని పలు రకముల పరిశోధనలో వినియోగించాడు. నడిగూడెం నందు వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించాడు. ఈ పరిశోధనలలో కంబోడియా పత్తి అను ఒక ప్రత్యేక రకమైన పత్తి మీద విశేష కృషి చేశాడు. ఈయన కృషిని ఆనాటి బ్రిటీషు ప్రభుత్వము కూడా గుర్తించడముతో ఈయనకు పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. నడీగూడెం కోటలో అలా జాతీయ జెండా రూపకల్పన ప్రాంతంగా కీర్తి దక్కింది. పింగళి వెంకయ్య జాతీయోద్యమ సేవలకు గుర్తింపుగా 2009లో కేంద్రం 5 రూపాయల తపాలా బిళ్ళను విడుదల చేసింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గ్రంథాలయ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న నడిగూడెం అదే స్ఫూర్తితో డెక్కన్ సంస్థ నడిగూడెం కోట గడిని పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దాలని డక్కన్ సంస్థ చైర్మన్ కుర్రా జితేంద్రబాబు ఈ ప్రాంత వాసి కావడంతో నడిగూడెం కోటను పరిశోధక కేంద్రంగా తీర్చి దిద్దుతూ కోటను పునర్నిర్మాణం చేసి కోటలో వివిధ భాషల్లో ఉన్నటువంటి రెండు లక్షల 50 వేల పుస్తకాలు, 50 వేల పైచిలుకు తాళపత్ర గ్రంథాలను ఈ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల పరిశోధక విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లకు నడిగూడెం కోట కేంద్ర బిందువుగా మారింది. ఇతరులను గడి లోపలకు అనుమతించకపోవడంతో జిల్లా ప్రజలు కొంతమేరకు అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ, ఇతర సంబంధిత శాఖ చర్యలు తీసుకొని నడిగూడెం కోటను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
చరిత్రను వెతికి తీస్తున్న పరిశోధన కేంద్రం: రామానాయుడు రీసెర్చ్ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
వివిధ భాషలతో కలిగిన పుస్తకాలు, గ్రంథాలు ఈ ప్రాంతంలో ఉంచడం చాలా సంతోషకరం. కనుమరుగవుతున్న చరిత్ర వెలికి తీయడం కొరకు ఈ పరిశోధన కేంద్రం ప్రారంభించారు. కోట అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న జితేందర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.