ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగ భద్రత కల్పించాలి
దిశ, న్యూస్బ్యూరో: ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయయని, ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రికి ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఎంటువంటి స్పందన లేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేట్ అధ్యాపకులు కూలీలుగా మారుతున్నారంటేనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు రుజువవుతోందని […]
దిశ, న్యూస్బ్యూరో: ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి, లాక్డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వైద్య ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయయని, ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రికి ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఎంటువంటి స్పందన లేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేట్ అధ్యాపకులు కూలీలుగా మారుతున్నారంటేనే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు రుజువవుతోందని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లు గడిస్తూ తమ ఆస్తులను పెంచుకుంటున్నాయి తప్ప సంస్థల అభివృద్ధికి మూలమైన అధ్యాపకులను, సిబ్బందిన పట్టించుకోవడం లేదన్నారు.