అంతరిక్షం నుంచి ఓటేసిన ఆస్ట్రోనాట్

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అటు ట్రంప్, ఇటు బైడెన్‌లు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎవరెంత ప్రచారం చేసినా.. అధ్యక్షుడిని డిసైడ్ చేసేదే ప్రజలే. వాళ్ల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు. ఈ తరుణంలో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైంది. అందుకే.. సుదూర ప్రాంతాల్లో ఉండి ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేని వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. […]

Update: 2020-10-26 01:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. నవంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అటు ట్రంప్, ఇటు బైడెన్‌లు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. ఎవరెంత ప్రచారం చేసినా.. అధ్యక్షుడిని డిసైడ్ చేసేదే ప్రజలే. వాళ్ల చేతుల్లో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు. ఈ తరుణంలో ఒక్క ఓటు కూడా ఎంతో విలువైంది. అందుకే.. సుదూర ప్రాంతాల్లో ఉండి ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేని వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో అమెరికన్ అంతరిక్ష కేంద్రం నుంచి తాజాగా ఒకరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతకీ ఆ తొలి ఓటు వేసిందెవరు? అంతరిక్షం నుంచి ఓటు వేసే హక్కు ఎప్పుడు మొదలైంది?

అది అంతరిక్ష నాసా కేంద్రం.. అక్కడే ‘ఐఎస్ఎస్ ఓటింగ్ బూత్’ అని రాసి ఉన్న ప్యాడెడ్ బూత్ ఉంది. అక్కడ కేట్ రూబిన్స్ అనే ఉమెన్ ఆస్ట్రోనాట్ చిరునవ్వులు చిందిస్తూ.. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా నిలుచుంది. బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకుని.. నేను ఓటేశానోచ్ అని అంతరిక్షం నుంచి చెబుతోంది. అయితే, కేట్ రూబిన్స్ ఐఎస్‌ఎస్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారేం కాదు. 2016లోనూ ఆమె అంతరిక్షం నుంచే ఓటు వేయడం విశేషం. ‘అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన బాధ్యత. అక్టోబర్ 14 నుంచి మొదలైన ఐఎస్ఎస్ మిషన్‌లో ఉన్నాను. ఓటింగ్‌ జరిగే రోజున తాను స్పేస్‌‌ మిషన్‌లో ఉంటాను’ అని రూబిన్స్ తెలిపింది. రూబిన్స్ ఓటు వేసిన ఫోటోను నాసా ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది.

అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని నాసా 1997 నుంచి కల్పిస్తోంది. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఫెడరల్‌ పోస్ట్ కార్డు అప్లికేషన్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024లో చంద్రుడి మీదకు ఆస్ట్రోనాట్స్‌ను పంపించాలనుకుంటున్నాం. మార్స్‌పైనా ఆస్ట్రోనాట్స్ సోలార్ సిస్టమ్‌లో ఎక్కడ ఉన్నా.. ఓటు హక్కును మాత్రం వినియోగించుకుంటారు’ అని నాసా తెలిపింది.

Tags:    

Similar News