సారూ.. మా పొలాల్లో కెమికల్ ఫ్యాక్టరీకి పర్శిషన్ ఇవ్వొద్దు.. ఎమ్మెల్యే కాళ్లపై పడిన మహిళలు
దిశ, నర్సాపూర్ : పచ్చని పంట పొలాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారని, దయచేసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు కొందరు మహిళలు. వీరంతా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన గ్రామస్తులుగా తెలుస్తోంది. గత రెండు నెలలుగా కెమికల్ ఫార్మసీ నిర్మాణం చేపట్టవద్దని గ్రామంలో తీర్మానించి మరీ, రహదారులపైన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి వివిధ రూపాలలో తమ నిరసనను తెలియజేశామన్నారు. […]
దిశ, నర్సాపూర్ : పచ్చని పంట పొలాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారని, దయచేసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు కొందరు మహిళలు. వీరంతా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన గ్రామస్తులుగా తెలుస్తోంది. గత రెండు నెలలుగా కెమికల్ ఫార్మసీ నిర్మాణం చేపట్టవద్దని గ్రామంలో తీర్మానించి మరీ, రహదారులపైన ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి వివిధ రూపాలలో తమ నిరసనను తెలియజేశామన్నారు.
స్పందించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి మంగళవారం కెమికల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న స్థలాన్ని సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న స్థలం వద్దకు చేరుకుని ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని ఎమ్మెల్యేను కోరారు. కొందరు మహిళలైతే ఏకంగా ఎమ్మెల్యే కాళ్లపై పడి వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కంపెనీకి సంబంధించిన విషయం మంత్రితో మాట్లాడి ప్రజలకు అనుకూలమైన నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. దీంతో బాధిత మహిళలు శాంతించారు.