ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళలే టాప్..
దిశ, నర్సాపూర్: శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందు కోసం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మొత్తం 68 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 31 మంది, స్త్రీలు 37 మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే స్ర్తీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు […]
దిశ, నర్సాపూర్: శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందు కోసం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మొత్తం 68 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 31 మంది, స్త్రీలు 37 మంది ఉన్నారు. అయితే పురుషుల కంటే స్ర్తీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.