నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
దిశ, మహబూబ్నగర్: సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కిరాణ, నిత్యావసరాలు, వైద్య సంబంధిత సామగ్రిని అనుమతించాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలోని సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. షిఫ్టుల వారీగా […]
దిశ, మహబూబ్నగర్: సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కిరాణ, నిత్యావసరాలు, వైద్య సంబంధిత సామగ్రిని అనుమతించాలని పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లాలోని సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. షిఫ్టుల వారీగా పోలీస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చేతన హెచ్చరించారు.
Tags: sp chetana, visit, checkpost, narayanpet