‘విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం’

దిశ, నారాయణఖేడ్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలంలోని జూక్కల్ శివారులో రూ.4 కోట్ల 30 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.17.20 కోట్లతో నియోజకవర్గంలోని గిరిజన గురుకులాల భవనాలను వేగవంతంగా నిర్మిస్తున్నామని తెలిపారు. […]

Update: 2020-09-22 03:07 GMT

దిశ, నారాయణఖేడ్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాముఖ్యత ఇస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలంలోని జూక్కల్ శివారులో రూ.4 కోట్ల 30 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న గిరిజన బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.17.20 కోట్లతో నియోజకవర్గంలోని గిరిజన గురుకులాల భవనాలను వేగవంతంగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నిర్మాణాలతో గిరిజన విద్యార్థులకు మేలు చేకూరుతుందని చెప్పారు.

Tags:    

Similar News