వైభవంగా సింహాచలంలో చందనోత్సవం
నేడు సింహాచలంలో వైభవంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామి చందనోత్సవం జరుగనుంది. ఈ ఉత్సవంలో స్వామివారు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు. స్వామివారిని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరుపున ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పట్టువస్ర్తాలు సమర్పించారు. కరోనా వైరస్ మూలంగా లాక్‌డౌన్ విధించడంతో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం స్వామివారికి 3 మణుగుల తొలివిడత చందనం సమర్నించనున్నారు. పరిమిత సంఖ్యలో వైదికులు, సిబ్బందితో ఈ చందనోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ఘాట్ […]
నేడు సింహాచలంలో వైభవంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామి చందనోత్సవం జరుగనుంది. ఈ ఉత్సవంలో స్వామివారు నిజరూపంలో దర్శనమివ్వనున్నారు. స్వామివారిని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరుపున ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పట్టువస్ర్తాలు సమర్పించారు. కరోనా వైరస్ మూలంగా లాక్‌డౌన్ విధించడంతో స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం స్వామివారికి 3 మణుగుల తొలివిడత చందనం సమర్నించనున్నారు. పరిమిత సంఖ్యలో వైదికులు, సిబ్బందితో ఈ చందనోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ఘాట్ రోడ్లతోపాటు మెట్ల మార్గాలనూ ఆలయ అధికారులు మూసివేశారు.
Tags: Narasimha Swamy, Chandanotsavam, simhachalam, temple eo, coronavirus