ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం

దిశ, ఏపీ బ్యూరో: నరసరావుపేటలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మండలంలో పాజిటివ్ కేసుల సంఖ్య 541కి చేరింది. పట్ణణంతో పాటు మండలంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామాలకు వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు ప్రకటించారు. లాక్‌డౌన్‌ నుంచి మందుల […]

Update: 2020-07-18 00:50 GMT

దిశ, ఏపీ బ్యూరో: నరసరావుపేటలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మండలంలో పాజిటివ్ కేసుల సంఖ్య 541కి చేరింది. పట్ణణంతో పాటు మండలంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామాలకు వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు ప్రకటించారు.

లాక్‌డౌన్‌ నుంచి మందుల షాపులు, పాల బూత్‌లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. బ్యాంకులు, ప్రైవేటు ఆస్పత్రులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య సేవలు ఒక్క ప్రభుత్వ అసుపత్రిలోనే అందుబాటులో ఉంటాయి. పది రోజుల పాటు సకలం బంద్‌ అమల్లో ఉంటుంది. ముందస్తు చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అన్ని పరిస్థితులు సమీక్షించిన తరువాతే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. తాజాగా పట్టణంలో 26, గ్రామాలలో 15 కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. ప్రకాష్‌నగర్‌లో 8, రామిరెడ్డిపేటలో 1, పాతూరు, బరంపేట, మల్లమ్మసెంటర్‌, ఎన్‌జీవోకాలనీ, సాయినగర్‌, రెడ్డినగర్‌, కాకతీయనగర్‌, బాలయ్యనగర్‌, జొన్నలగడ్డలో 4, రావిపాడులో 2, ఇస్సపాలెంలో 1, కొత్తపాలెంలో 3, ములకలూరులో 1 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News