మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు నిర్మించలేరు: నారా లోకేశ్..

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని తేల్చి చెప్పేశారు. ‘ప్రజారాజ‌ధానిపై ప్రభుత్వాధినేత‌గా వైఎస్ జ‌గ‌న్‌ కుట్రల‌పై అమ‌రావ‌తి రైతులు, కూలీల‌ పోరాటం 700 రోజుల‌కి చేరిందని నారా లోకేశ్ అన్నారు. 30 వేల మంది రైతుల స‌మ‌స్యగా చిన్నచూపు చూసిన.. పాల‌కుల క‌ళ్లు బైర్లు క‌మ్మేలా కోట్లాది రాష్ట్రప్రజలు మ‌ద్దతుగా నిలిచారన్నారు. అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ […]

Update: 2021-11-16 04:20 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని తేల్చి చెప్పేశారు. ‘ప్రజారాజ‌ధానిపై ప్రభుత్వాధినేత‌గా వైఎస్ జ‌గ‌న్‌ కుట్రల‌పై అమ‌రావ‌తి రైతులు, కూలీల‌ పోరాటం 700 రోజుల‌కి చేరిందని నారా లోకేశ్ అన్నారు. 30 వేల మంది రైతుల స‌మ‌స్యగా చిన్నచూపు చూసిన.. పాల‌కుల క‌ళ్లు బైర్లు క‌మ్మేలా కోట్లాది రాష్ట్రప్రజలు మ‌ద్దతుగా నిలిచారన్నారు. అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వరకు పాద‌యాత్ర జ‌న‌సంద్రాన్ని త‌ల‌పిస్తోంది’ అని లోకేశ్ అన్నారు.

‘జ‌గ‌న్‌రెడ్డి ఆయ‌న మంత్రులు మ‌రో మూడు జ‌న్మలెత్తినా మూడురాజ‌ధానులు క‌ట్టలేరని విమర్శించారు. ప్రజారాజ‌ధాని కోసం భూములు, ప్రాణాలు తృణ‌ప్రాయంగా రైతులు చేసిన త్యాగం నిరుప‌యోగం కాదన్నారు. అమ‌రావ‌తి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజ‌ల ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. అమ‌రావతి వైపు న్యాయం ఉందని.. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా ప్రజ‌లు, రాజ‌కీయ పార్టీల‌ మ‌ద్దతు ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌-ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి మాత్రమే ఉంటాయి’ అని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

వైసీపీయే ప్రధాన శత్రువు.. టీడీపీకి దూరం: అమిత్ షా

Tags:    

Similar News