సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి నేతన్నల తరఫున 4డిమాండ్లను ఆయన ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలాగే, సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న […]
దిశ, వెబ్‌డెస్క్: సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి నేతన్నల తరఫున 4డిమాండ్లను ఆయన ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
అలాగే, సొంత మగ్గం ఉన్న వారికే పథకం అంటూ నిబంధనల పేరుతో కోత విధించకుండా ప్రతీ నేత కార్మికునికి ‘నేతన్న నేస్తం’ కింద రూ.24,000 ఇవ్వాలని సూచించారు. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. నేతన్న దగ్గర ఉన్న స్టాక్ ని ఆప్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని లోకేశ్ లేఖలో వెల్లడించారు.