జగనన్న బీరు పండగ: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు, చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘జగనన్న బీరు పండుగ’ ఘనంగా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ ఎద్దేవా […]
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు, చోటుచేసుకున్న పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ‘జగనన్న బీరు పండుగ’ ఘనంగా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ సమయంలో వైఎస్సార్సీపీ ఎలుకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరిచేసేందుకే లిక్కర్ అమ్మకాలకు పచ్చజెండా ఊపారని ఆయన ఆరోపించారు.
tags: nara lokesh, tdp, ysrcp, jagan, twitter